Hyderabad: విమానాశ్రయానికి మెట్రో రైలు.. సేకరించాల్సిన ప్రైవేటు ఆస్తుల గుర్తింపు!

Shamshabad Metro Alignment Marking Completed

  • శంషాబాద్ మెట్రో మార్గం పొడవు 31 కిలోమీటర్లు
  • 30 కిలోమీటర్ల మార్గంలో ప్రభుత్వ ఆస్తులే
  • కిలోమీటరు పరిధిలో ప్రైవేటు ఆస్తులు
  • అలైన్‌మెంట్ మార్కింగ్ పూర్తి

శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం దిశగా మరో ముందడుగు పడింది. మెట్రో రూట్‌కు సంబంధించి అలైన్‌మెంట్ మార్కింగ్ పూర్తికావడంతో ప్రైవేటు ఆస్తుల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. ఖాజాగూడ, నానక్‌రాంగూడ, శంషాబాద్ ప్రాంతాల్లో మలుపులు ఉండడంతో అక్కడ ప్రైవేటు ఆస్తులను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంగా కిలోమీటర్ మేర ఆస్తులు సేకరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సేకరించాల్సిన ఆస్తుల్లో 95 శాతం ఖాళీ స్థలాలే కాగా, 5 శాతం మాత్రం భవనాలు ఉన్నట్టు గుర్తించారు. 

శంషాబాద్ మెట్రో మార్గం పొడవు 31 కిలోమీటర్లు. ఈ మార్గంలో 30 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓఆర్ఆర్, ప్రభుత్వ భూముల్లోంచే మార్గం ఉంటుంది. అయితే, ఒక్క కిలోమీటర్ పరిధిలో మాత్రం ఆస్తులు సేకరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News