Katha Venuka Katha: ‘కథ వెనుక కథ’ సినిమా విడుద‌ల వాయిదా

Katha Venuka Katha release postponed

  • విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా 'కథ వెనుక కథ'
  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో చిత్రం
  • తొలుత మార్చి 24న విడుదల అవుతుందని ప్రకటన
  • అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడిందన్న సహ నిర్మాత

విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా  రూపొందిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై అవనీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేస్తున్న‌ట్లు తొలుత ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు విడుద‌ల వాయిదా ప‌డింది. 

దీనిపై సహ నిర్మాత గొట్టిపాటి సాయి స్పందించారు. ‘‘మా క‌థ వెనుక క‌థ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే కొన్ని అనివార్య కార‌ణాల‌తో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. త్వ‌ర‌లోనే మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తాం’’ అని వివరించారు. 

ఈ చిత్రంలో అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, పాటలకు కాసర్ల శ్యామ్, పూర్ణాచారి సాహిత్యం సమకూర్చారు.

More Telugu News