Santosh Sobhan: 'అన్నీ మంచి శకునములే' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

Anni Manchi Sakunamule title song relesed

  • నందినీ రెడ్డి నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • సంతోష్ శోభన్ జోడీగా మాళవిక నాయర్ 
  • సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ 
  • మే 18వ తేదీన సినిమా విడుదల  


'అలా మొదలైంది' .. 'ఓ బేబీ' వంటి హిట్స్ ఇచ్చిన నందిని రెడ్డి, తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి 'అన్నీ మంచి శకునములే' సినిమాను సిద్ధం చేస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథతో ఆమె ఈ సినిమాను రూపొందించారు. 

సంతోష్ శోభన్ జోడీగా ఈ సినిమాలో మాళవిక నాయర్ అలరించనుంది. తారాగణం పరంగా చిన్న సినిమా అనిపించినప్పటికీ, స్వప్న సినిమాస్ - వైజయంతి మూవీస్ వంటి బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమైంది. కొంతసేపటి క్రితమే సినిమా నుంచి టైటిల్ సాంగును రిలీజ్ చేశారు. 

'అన్నీ మంచి శకునములే .. అనుకుని సాగితే' అంటూ ఈ పాట నడుస్తోంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాట మంచి ఫీల్ తో కనెక్ట్ అవుతోంది. రాజేంద్రప్రసాద్ .. నరేశ్ .. రావు రమేశ్ .. గౌతమి .. షావుకారు జానకి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, మే 18వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News