Raj Karthiken: 'రాజ్ కహాని' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Raj Kahani movie trailer released

  • రాజ్ కార్తికేన్ హీరోగా రూపొందిన 'రాజ్ కహాని' 
  • కథానాయికగా చంద్రిక అవస్తి పరిచయం 
  • సంగీతాన్ని అందించిన మహిత్ నారాయణ్
  • ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న సినిమా 


ప్రస్తుతం హీరోలు, దర్శకులు అన్న తేడా ఉండటం లేదు. మంచి కథను రాసుకుని దర్శకులే నటిస్తున్నారు.. హీరోలే దర్శకులూ అవుతున్నారు. హీరో కమ్ డైరెక్టర్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అలానే ఇప్పుడు 'రాజ్ కహాని' అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా తన సత్తాను చాటేందుకు రాజ్ కార్తికేన్  రెడీ అయ్యాడు. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలుగా, రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 

ఈ సినిమాలో  చంద్రిక అవస్తి, సోనియా సాహా .. ప్రియా పాల్ .. సాయి .. జబర్దస్త్ ఫణి తదితరులు నటించారు. మార్చి 24న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు వైవీఎస్ చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిథులుగా వచ్చారు. ట్రైలర్ బాగుందని చెబుతూ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ట్రైలర్ చూస్తే కామెడీ, ఎమోషన్ సమపాళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 'రాజ్ కహాని' సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వబోతోన్నట్టుగా ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్‌లో ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి మహిత్ నారాయణ్ అందించిన సంగీతం ప్లస్ అవుతుంది. యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఆయన విజువల్స్ ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సినిమాను మార్చి 24న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

More Telugu News