Pathaan Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'పఠాన్'.. ఎప్పటి నుంచి ఎందులో అంటే..?

Pathaan Movie OTT streaming in Amazon Prime from March 22
  • షారుఖ్, దీపికా పదుకొణే జంటగా 'పఠాన్'
  • వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన చిత్రం
  • రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ప్రారంభం
వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న బాలీవుడ్ కు 'పఠాన్' చిత్రం ఊపిరిపోసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా... 'బాహుబలి 2' పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 

ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు ఈ సినిమా రెడీ అయింది. రేపు (మార్చి 22) ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'పఠాన్'... ఓటీటీలో మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. 

Pathaan Movie
OTT
Amazon Prime
Shahrukh Khan
Deepika Padukone

More Telugu News