Eesha Rebbah: వెండితెరపై విరిసిన తెలుగు అందం ఈషా రెబ్బా .. లేటెస్ట్ పిక్స్!

Eesha Rebba Special

  • 2012లోనే ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా 
  • హాట్ బ్యూటీగా కుర్రకారులో మంచి క్రేజ్ 
  • సరైన బ్రేక్ కోసమే చాలా కాలంగా వెయిటింగ్ 
  • ఇతర భాషా చిత్రాల దిశగానూ అడుగులు


తెలుగు తెరపై తెలుగు కథానాయికలు నిలదొక్కుకోవడం కష్టమైన విషయమే. ఎందుకంటే ఒక వైపున బాలీవుడ్ నుంచి .. మరో వైపున తమిళ .. మలయాళ ఇండస్ట్రీల నుంచి ఇక్కడికి వచ్చే కథానాయికల సంఖ్య ఎక్కువ. తెరపై గ్లామరస్ గా కనిపించే విషయంలో తెలుగు కథానాయికలకు కొన్ని పరిమితులు ఉండటం వలన, ఇతర భాషలకి చెందిన నాయికల హవానే ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది."అయితే స్వాతి రెడ్డి .. అంజలి తెలుగువారే అయినా, నటన పరంగా ఓ నాలుగు అడుగులు ముందుకు వేశారు. తెలుగులో చేస్తూనే ఇతర భాషాల్లో స్టార్ డమ్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో వెళుతున్న కథానాయికగా ఈషా రెబ్బా కనిపిస్తోంది. ఈ బ్యూటీ వరంగల్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. 2012లోనే తెలుగు తెరపైకి వచ్చిన ఈషా, ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. అయితే వాటిలో ఆమె టాలెంట్ కి తగిన పాత్రలు పడకపోవడమే మైనస్ అయిందని చెప్పాలి. హాట్ బ్యూటీగా కుర్రకారులో ఆమెకి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, సక్సెస్ దోబూచులాడుతోంది. అయినా డీలా పడిపోకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఒక వైపున తెలుగు సినిమాల్లో అవకాశాలను అందుకుంటూనే, తమిళ .. మలయాళ సినిమాల్లో కుదురుకోవడానికి ట్రై చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ ల దిశగా కూడా అడుగులు వేస్తోంది.

Eesha Rebbah
Actress
Tollywood

More Telugu News