Prakash Raj: 'రంగమార్తాండ' చూసినవారు నన్ను తిట్టుకుంటారేమో: అనసూయ

Anasuya Interview

  • కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగమార్తాండ '
  • కీలకమైన పాత్రను పోషించిన అనసూయ 
  • ప్రకాశ్ రాజ్ కోడలిగా కనిపిస్తానని వెల్లడి 
  • కృష్ణవంశీ దర్శకత్వంలో మళ్లీ చేయాలనుందని వ్యాఖ్య


ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన 'రంగమార్తాండ' ఈ నెల 22వ తేదీన థియేటర్లకు రానుంది. కృష్ణవంశీ నుంచి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో అనసూయ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించి ప్రస్తావించింది. 

"మొదటి నుంచి కూడా నాకు కృష్ణవంశీగారి సినిమాలంటే ఇష్టం. అప్పట్లో 'మురారి' చాలాసార్లు చూశాను. అలాంటి కృష్ణవంశీ గారి దర్శకత్వంలో చేసే అవకాశం రావడమే అదృష్టం. కృష్ణవంశీ గారు లేడీస్ పాత్రలను చాలా అందంగా .. చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. ప్రకాశ్ రాజ్ గారి కోడలు పాత్రలో 'గీతా రంగారావు'గా నేను కనిపిస్తాను" అని అంది.  

" ఈ సినిమాలో నా స్వభావానికి పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపిస్తాను. నా పాత్రను చూసి ఆడియన్స్ తిట్టుకుంటారేమోనని కృష్ణవంశీ గారితో అన్నాను. అలా ప్రవర్తించడం ఆ పాత్ర వరకూ కరెక్ట్ అని ఆయన అన్నారు. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఈ సినిమా చేసినా నా తనివి తీరలేదు. మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను"అంటూ చెప్పుకొచ్చింది. 

Prakash Raj
Ramyakrishna
Anasuya
Rangamartanda movie
  • Loading...

More Telugu News