Naatu Naatu: 'నాటు నాటు' పాటకు టెస్లా కార్ల లైటింగ్ అదిరిపోయింది... వైరల్ వీడియో ఇదిగో!

Tesla cars lighting show for Naatu Naatu song

  • ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నాటు నాటు పాట
  • ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు
  • ఇప్పటికీ తగ్గని మేనియా
  • అమెరికాలో నాటు నాటు పాటకు లయబద్ధంగా లైటింగ్ షో 
  • వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం

ఆర్ఆర్ఆర్ విడుదలైంది మొదలు మొన్నటి ఆస్కార్ వరకు నాటు నాటు పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. సాహిత్యానికి సంబంధించిన శబ్ద సౌందర్యం, సంగీతం, ఐకానిక్ డ్యాన్స్ స్టెప్పు భాషలకు అతీతంగా నాటు నాటు పాటను వివిధ దేశాల ప్రజలకు బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కనిపిస్తుంటాయి. 

తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం ఆవిష్కృతమైంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరిపోతూ వెలుగుతూ లయబద్ధంగా చేసిన ఆ లైటింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News