Karthi: 'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి సాంగ్ రిలీజ్!

Ponniyin Selven 2 song released

  • సంచలన విజయాన్ని సాధించిన 'పీఎస్ 1'
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'పీఎస్ 2' 
  • అంచనాలు పెంచుతున్న సెకండ్ పార్టు 
  • ఏప్రిల్ 28వ తేదీన విడుదలవుతున్న  సినిమా


మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' క్రితం ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. చోళ .. పాండ్య రాజుల మధ్య జరిగిన పోరాటమే ఈ కథ. విక్రమ్ .. కార్తీ .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. త్రిష ప్రధానమైన పాత్రలను పోషించారు. 

అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు సెకండ్ పార్టు రావడానికి రెడీ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి, తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే' అంటూ ఈ పాట మొదలవుతోంది. వాల్ పెయింటింగ్స్ తరహాలో ఈ పాటను ఆవిష్కరించారు. కార్తీ - త్రిష పై ఈ పాటను చిత్రీకరించారు.  

ఎక్కడి నుంచి అయితే అసలు కథ మొదలవుతుందో అక్కడే ఫస్టు పార్టును ఆపేశారు. అసలు కథ అంతా కూడా సెకండ్ పార్టులోనే ఉండనుంది. అందువలన అందరూ కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వివిధ భాషల్లో థియేటర్లకు రానుంది.

More Telugu News