Lawrence: లారెన్స్ 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఖరారు!

Rudrudu Second Single Released

  • లారెన్స్ హీరోగా 'రుద్రుడు'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • కథిరేసన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది 
  • ఈ నెల 22న సెకండ్ సింగిల్ రిలీజ్ 
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్


ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు లారెన్స్ సినిమా రాలేదు. దాంతో ఆయన నుంచి సినిమా కోసం అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆయన కథానాయకుడిగా 'రుద్రుడు' సినిమా రూపొందింది. ఈ సినిమాకి కథిరేసన్ దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. 

యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా పలకరించనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీన 'భగ భగ రగలరా' అనే పాటను వదలనున్నట్టుగా అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

 లారెన్స్ జోడీగా ప్రియా భవాని శంకర్ అలరించనుంది. 'కల్యాణం కమనీయం' సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో శరత్ కుమార్ .. పూర్ణిమ భాగ్యరాజ్ కనిపించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

More Telugu News