Magunta Sreenivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం... వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

ED issues notices to YCP MP Magunta

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కోణం
  • ఇప్పటికే మాగుంట రాఘవ అరెస్ట్
  • రేపు మాగుంట శ్రీనివాసులురెడ్డిని విచారించనున్న ఈడీ
  • విచారణకు రావాలంటూ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కోణం నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. రేపు (మార్చి 21) విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఇటీవలే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో, మాగుంట శ్రీనివాసులురెడ్డిని కూడా ఈడీ ప్రశ్నించనుంది. 

కాగా, మాగుంట రాఘవ కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగించడం తెలిసిందే. రాఘవ బెయిల్ పిటిషన్ ఈ నెల 23న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణకు రానుంది.

Magunta Sreenivasulu Reddy
Notice
ED
Delhi Liquor Scam
Magunta Raghava
  • Loading...

More Telugu News