Prakash Raj: నీ కూతురే నిన్ను దొంగ అంటోంది: 'రంగ మార్తాండ' ట్రైలర్ డైలాగ్

Rangamarthanda movie trailer released

  • 'రంగమార్తాండ'గా కనిపించనున్న ప్రకాశ్ రాజ్
  • కీలక పాత్రల్లో రమ్యకృష్ణ - బ్రహ్మానందం 
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ
  • చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా   
  • ఈ నెల 22వ తేదీన రిలీజ్


కృష్ణవంశీ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగమార్తాండ' సినిమా రూపొందింది. కాలెపు మధు - వెంకట్ నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 'ఉగాది' కానుకగా ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రంగస్థల నటుడిగా తన గత వైభవాన్ని ప్రకాశ్ రాజ్ గుర్తుచేసుకునే నేపథ్యంలో ఈ ట్రైలర్ ను వదిలారు. తన కుటుంబ సభ్యులే తన పెద్దరికానికి ఎదురు తిరగడం .. తన కూతురే తనని దొంగగా అనుమానించడం వంటి సంఘటనలు తట్టుకోలేక భార్యతో మరో ప్రయాణాన్ని మొదలుపెట్టడం .. ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. బలమైన ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.    

జీవితంలో నటనను ప్రాణంగా భావించిన ఒక రంగస్థల కళాకారుడి అనుభవాలు .. జ్ఞాపకాలుగా ఈ సినిమా రూపొందింది. అనుభూతులకు .. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ వలన అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ చేస్తున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

More Telugu News