ntr: కృష్ణానగర్ కష్టాలు చూసినవాడిని నేను: 'నాటు నాటు' కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్! 

Prem Rakshith Interview

  • కొరియోగ్రఫర్ గా రాణిస్తున్న ప్రేమ్ రక్షిత్ 
  • ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డానని వెల్లడి
  • రాజమౌళి వరుస ఛాన్సులు ఇవ్వడం పట్ల హర్షం  
  • 'నాటు నాటు' పాట కోసం ఇద్దరు హీరోలు కష్టపడ్డారని వ్యాఖ్య 
  • ఆస్కార్ సమయంలో కన్నీళ్లొచ్చాయని వివరణ  


'ఆర్ ఆర్ ఆర్' సినిమా'లోని 'నాటు నాటు' పాటకి 'ఆస్కార్' అవార్డు దక్కింది. కీరవాణి సంగీతం .. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకి, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. ఈ పాటలో ప్రధానమైన ఆకర్షణ కొరియోగ్రఫీనే. దాంతో అందరి దృష్టి సహజంగానే ప్రేమ్ రక్షిత్ వైపు వెళ్లింది. 

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. '' నేను కృష్ణానగర్ నుంచి వచ్చిన వాడిని. అక్కడి కష్టాలను చూసినవాడిని. రాజామౌళి ఇంట్లో కార్తికేయ .. కాలభైరవ ... సింహాలకు నేను డాన్స్ నేర్పేవాడిని. మరో ఇద్దరు కుర్రాళ్లకు కూడా ఇళ్లకు వెళ్లి క్లాసులు తీసుకునేవాడిని. అలా వచ్చిన డబ్బుతోనే అతికష్టం మీద రోజులు గడుపుతూ వెళ్లేవాడిని'' అన్నారు.

రాజమౌళి గారు నాకు వరుస అవకాశాలు ఇస్తూ వచ్చారు. సై .. ఛత్రపతి .. విక్రమార్కుడు .. మగధీర .. ఇలా అన్ని సినిమాలకు పనిచేస్తూ వచ్చాను. 'నాటు నాటు' పాటను అటు ఎన్టీఆర్ .. ఇటు చరణ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేయవలసి వచ్చింది. ఈ పాటకి ఆస్కార్ ప్రకటించినప్పుడు మా అందరికీ మాటలు రాలేదు .. కళ్ల వెంట ఆలా నీళ్లు వస్తూనే ఉన్నాయి. నిజంగా ఈ పాట కోసం ఎన్టీఆర్ - చరణ్ చాలా కష్టపడ్డారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News