K Kavitha: కవితకు ధైర్యం చెప్పి ఈడీ కార్యాలయంలోకి పంపిన ఆమె భర్త.. రెండున్నర గంటలుగా కొనసాగుతున్న విచారణ

Kavitha husband Anil sents her into ED office
  • రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత
  • కవితను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న భర్త అనిల్
  • ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు ఆమె హాజరుకావడం ఇది రెండోసారి. రెండున్నర గంటలుగా ఆమె విచారణ కొనసాగుతోంది. ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్ల ముడుపులు అందడంపై ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఇతర డాక్యుమెంట్లపై కూడా ఆరా తీస్తున్నారు. 

మరోవైపు ఈడీ కార్యాలయంలోకి వెళ్లే ముందు కవితను ఆమె భర్త అనిల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ధైర్యం చెప్పి లోపలకు పంపించారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఆమె చేతిలో డాక్యుమెంట్ లాంటి పేపర్ ఉంది. ఈడీ అడిగిన వివరాలను నేరుగా అందించేందుకు కవిత ఆ పేపర్ ను తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్లారు.

K Kavitha
BRS
Delhi Liquor Scam
Enforcement Directorate
Husband

More Telugu News