Mahesh Babu: త్రివిక్రమ్–మహేశ్​ సినిమా కోసం బుట్టబొమ్మ వచ్చేసింది

Pooja Hegde arrived in Hyderabad to join SSMB28 shoot

  • అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ తో మహేశ్ మూడో చిత్రం 
  • హైదరాబాద్ లో భారీ సెట్ లో శరవేగంగా షూటింగ్
  • ఆగస్టు 11న విడుదల కానున్న చిత్రం

టాలీవుడ్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మూడో చిత్రం రాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.  శ్రీలీల మరో హీరోయిన్‌. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. భారీ సెట్ లో మహేష్‌ తో పాటు ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. షూటింగ్ లో పాల్గొనేందుకు పూజా హెగ్డే హైదరాబాద్ లో అడుగు పెట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ తో కిసికా భాయి కిసికా జాన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ఇప్పుడు మహేష్–త్రివిక్రమ్ చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టనుంది. మహేష్ కెరీర్‌‌లో ఇది 28వ చిత్రం. ఆగస్టు 11న విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.


ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రివిక్రమ్–అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురములో చిత్రంలో జయరామ్ పాత్ర ఆకట్టుకుంది. ఇప్పుడు మహేష్ సినిమాలో నటిస్తున్నందుకు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. హైదరాబాద్ సెట్‌లో మహేష్‌, త్రివిక్రమ్ తో దిగిన ఫొటోలను ఆయన  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘థియేటర్లలో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్ తో పని చేస్తున్నాను. మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఉగాది కానుకగా.. ఈ సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ సంస్థ విడుదల చేయనుంది.

Mahesh Babu
Trivikram Srinivas
Pooja Hegde
ssmb28
Hyderabad
shooting
  • Loading...

More Telugu News