Vennira Adai Nirmala: ఎన్టీఆర్ నాకు ఒక హీరోగా కాదు .. దేవుడిలా కనిపించేవారు: సీనియర్ నటి 'వెన్నిరాడై' నిర్మల

Vennira Adai Nirmala Interview

  • అలనాటి అందాల తారగా 'వెన్నిరాడై' నిర్మల
  • అప్పటి స్టార్ హీరోల జోడీగా మెరిసిన నాయిక
  • ఏఎన్నార్ తో సాన్నిహిత్యం గురించి ప్రస్తావన 
  • అందుకే గ్యాప్ వచ్చిందని వెల్లడి 


'వెన్నిరాడై' నిర్మల .. అప్పట్లో కుర్రకారు కలల రాణి. తమిళంలో ఆమె చేసిన 'వెన్నిరాడై' సినిమా అప్పట్లో సూపర్ హిట్. అప్పటి నుంచి 'వెన్నిరాడై' అనేది నిర్మల ఇంటిపేరుగా మారిపోయింది. తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఆమె నటించారు. 60వ దశకం చివరిలో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. అప్పటి స్టార్ హీరోలందరితోను కలిసి నటించారు. 

తాజాగా 'ఐ డ్రీమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "అప్పట్లో కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు చెప్పిన అబద్ధాల కారణంగా నాకు బాధ కలిగింది. అందువల్లనే కొంత గ్యాప్ తీసుకున్నాను. అలాంటివారి మాటలను పట్టించుకుని కెరియర్ ను పాడుచేసుకోవద్దని ఏఎన్నార్ చెప్పారు. ఒక ఆర్టిస్ట్ కి కావలసింది ఆడియన్స్ నుంచి చప్పట్లు .. పురస్కారాలు అని చెప్పారు. తాను అందుకున్న అవార్డులను చూపించారు" అని అన్నారు. 

"ఇక ఎన్టీ రామారావుగారితో కూడా కలిసి నటించాను. ఆయన నాకు ఒక హీరోగా కాకుండా దేవుడిగానే కనిపించేవారు. నేను పూజించే శ్రీరాముడు .. శ్రీకృష్ణుడుగా అనిపించేవారు. ఆయన పట్ల నాకు ఎంతో భక్తి .. గౌరవము ఉండేవి. ఒక సినిమాలో నేను ఆయనకి చెల్లెలిగా నటించాను. అప్పుడు ఆయన నన్ను చూసి ' అచ్చు బొమ్మలాగే ఉంది' అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తు" అంటూ చెప్పుకొచ్చారు. 

Vennira Adai Nirmala
Actress
ANR
NTR
Tollywood
  • Loading...

More Telugu News