MS Dhoni: ఐపీఎల్ కు కూడా ధోనీ గుడ్ బై?.. చాహర్ ఏమన్నాడంటే ?

Will Dhoni retire after IPL 2023 What Deepak Chahar said

  • మరో రెండు సీజన్లు ఆడతారని భావిస్తున్నట్లు వెల్లడి
  • ఐపీఎల్ నుంచి తప్పుకునే విషయంలో ధోని ఎలాంటి ప్రకటనా చేయలేదన్న పేసర్
  • ధోనీతో కలిసి ఆడడం గొప్ప గౌరవం.. చాలామంది కలలు కంటుంటారన్న చాహర్

టీంఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరో వారం రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ సీజనే ధోనీకి చివరిదని, ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ స్పందించారు. మరో రెండు ఐపీఎల్ సీజన్లలో ధోనీ ఆడతారని స్పష్టం చేశారు.

‘ధోనికి ఈ ఐపీఎల్ సీజనే చివరిదంటూ ఎవరూ ప్రకటించలేదు. ధోనీ కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరిన్ని సీజన్లలో ఆయన ఆడాలనే మేం కోరుకుంటున్నాం. ఎంతకాలం ఆడాలి, ఎప్పుడు తప్పుకోవాలనే విషయం ధోనీకి బాగా తెలుసు. ధోనీ సారథ్యంలో ఆడడం నాలాంటి వారికి గొప్ప గౌరవం. చాలామంది కల. ధోని మరిన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ దీపక్ చాహర్ ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

MS Dhoni
deepak chahar
IPL 2023
retairment
msd
csk
  • Loading...

More Telugu News