New Delhi: నడివీధిలో షాకింగ్ సీన్.. యువతి షర్ట్ పట్టి బలవంతంగా కారులో ఎక్కించిన యువకుడు

Video of a boy forcing a girl into cab on busy road goes viral police launch probe

  • దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన
  • యువతిని బలవంతంగా కారులో ఎక్కించిన యువకుడు
  • నెట్టింట్లో వీడియో వైరల్
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 

నడివీధిలో ఓ యువతి వేధింపులకు గురైన ఘటన ప్రస్తుతం ఢిల్లీలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగోల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. తొలుత ఓ యువతి క్యాబ్‌లోంచి దిగిపోయింది. అయితే.. అదే కారులో ఉన్న ఓ యువకుడు కారు దిగిన ఆమెను షర్ట్ పట్టి బలవంతంగా కారులోకి తోశాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువైందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ స్పందించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. క్యాబ్ డ్రైవర్ అడ్రస్ కనుగొన్నామని, అతడితో పోలీసులు త్వరలో మాట్లాడతారని వెల్లడించారు. ‘‘ ఓ యువతి, ఇద్దరు యువకులు ఊబెర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నారు. రోహిణి నుంచి వికాస్‌పురి వెళ్లేందుకు క్యాబ్ పిలుచుకున్నారు. అయితే.. మార్గమధ్యంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఆ తరువాత యువతి కారు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు ఆమెను మెడపట్టి బలవంతంగా కారులోకి తోశాడు’’ అని తెలిపారు.

  • Loading...

More Telugu News