Chiranjeevi: భోళా శంకర్​ లో సుశాంత్ కీలక పాత్ర

sushant key role in Bhola shankar

  • మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్
  • సుశాంత్  ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
  • చిరు సరసన హీరోయిన్ గా తమన్నా

సోలో హీరోగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్న అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. అల వైంకుఠపురంలో చిత్రంలో కీలక పాత్రతో ఆకట్టుకున్న సుశాంత్ .. రావణాసుర చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో ఆఫర్ దక్కించుకున్నాడు. చిరు హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన, లవర్‌ బాయ్‌ తరహా పాత్రలో సుశాంత్‌ నటిస్తున్నాడు. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థతో కలసి అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌ గా నటిస్తోంది. మెగాస్టార్‌ చెల్లెలు పాత్రను కీర్తి సురేశ్‌ పోషిస్తోంది.

Chiranjeevi
Bhola shankar
sushanth
Tamannaah
  • Loading...

More Telugu News