Prakash Raj: నువ్వొక చెత్త నటుడివిరా .. 'రంగమార్తాండ' టీజర్ డైలాగ్!

Ranga Marthanda teaser released

  • ఓ రంగస్థల నటుడి కథనే 'రంగమార్తాండ'
  • తనదైన స్టైల్లో కృష్ణవంశీ రూపొందించిన సినిమా 
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ
  • ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల 

కృష్ణవంశీ సినిమాల్లో సహజత్వం కనిపిస్తుంది .. సందేశం ఆలోచింపజేస్తుంది. చాలా గ్యాప్ తరువాత ఆయన నుంచి రావడానికి 'రంగమార్తాండ' సినిమా రెడీ అవుతోంది. ఇది 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి రీమేక్. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించారు. 'ఉగాది' కానుకగా ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఒక మ్యూజిక్ లెంగ్త్ లో ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలను ఈ టీజర్ లో పరిచయం చేస్తూ వెళ్లారు. రమ్యకృష్ణ - బ్రహ్మానందం పాత్రలలోని ఎమోషన్ ను ఆవిష్కరించారు. ' రేయ్ .. నువ్వొక చెత్త నటుడివిరా .. మనిషిగా అంతకంటే నీచుడివి' అని ప్రకాశ్ రాజ్ ను బ్రహ్మానందం చెంపదెబ్బ కొట్టడం ఈ టీజర్ కి హైలైట్. 

నేనొక నటుడిని అంటూ ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పారు. ఈ కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరగనుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. సిరివెన్నెల రాసిన చివరి పాటను, ఇళయరాజా ఆలపించడం విశేషం. ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

Prakash Raj
Ramya Krishna
Brahmanadam
Ranga Marthanda

More Telugu News