Rohit Sharma: భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్ .. గ్రేస్ అదిరిపోయింది

Rohit Sharmas dance at his brother in laws marriage

  • బావమరిది పెళ్లి వేడుకలో సందడి చేసిన రోహిత్
  • హుషారైన స్టెప్పులు వేసిన రోహిత్ దంపతులు
  • పెళ్లి వేడుక కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న రోహిత్

మైదానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అతను కొట్టే అందమైన షాట్లకు అభిమానులు ఫిదా అవుతుంటారు. తన బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకున్న రోహిత్ ఇప్పుడు తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టాడు. అదిరిపోయే స్టెప్పులతో తనలోని డ్యాన్సర్ ను పరిచయం చేశాడు. తన బావమరిది కునాల్ సజ్దే (భార్య రితిక సోదరుడు) పెళ్లిలో రోహిత్ శర్మ సందడి చేశాడు. ఈ వేడుక కోసమే ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్ కు  రోహిత్ దూరంగా ఉన్నాడు. రోహిత్ గైర్హాజరీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జట్టుకు నాయకత్వం వహించాడు.

కునాల్ సజ్దే పెళ్లి పనులు దగ్గరుండి చూసుకున్న రోహిత్ దంపతులు.. వేడుకల్లో భాగంగా హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతోంది. రోహిత్ డ్యాన్స్ అదిరిపోయిందని, అతని గ్రేస్ చాలా బాగుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శుక్రవారం ముంబైలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు వన్డేల సిరీస్ లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం వైజాగ్ లో  జరిగే రెండో వన్డేలో రోహిత్ కెప్టెన్ గా బరిలోకి దిగనున్నాడు.

Rohit Sharma
dance
ritika
marriage
Team India

More Telugu News