Ntr: సెట్లో ఎన్టీఆర్ డైలాగ్స్ చూసుకోవడం నేను చూడలేదు: శుభలేఖ సుధాకర్

Subhalekha Sudhakar Interview

  • ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన శుభలేఖ సుధాకర్
  • సెట్లో ఆయన చాలా సరదాగా ఉంటారని వెల్లడి 
  • ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ ప్రశంసలు 
  • ఎన్టీఆర్ కసి .. కృషి గొప్పవని వ్యాఖ్య 

జూనియర్ ఎన్టీఆర్ మంచి డాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఆయనతో కలిసి పనిచేసిన హీరోయిన్స్, ఆయన స్పీడ్ ను అందుకోవడం తమ వల్ల కాలేదనే చెబుతుంటారు. కొరియోగ్రఫర్ చెప్పిన మూమెంట్స్ ను తాము ప్రాక్టీస్ చేస్తాముగానీ, ఎన్టీఆర్ నేరుగా టేక్ లోనే చేస్తుంటారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు.

తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి శుభలేఖ సుధాకర్ ప్రస్తావించారు. ఎన్టీఆర్ తో కలిసి 'అరవింద సమేత' చేశాను. సెట్లో ఆయన చాలా సరదాగా .. కలివిడిగా ఉంటారు. షాట్ రెడీ అనగానే కెమెరా ముందుకు వెళతారు. ఇక అప్పుడు ఆయనను పట్టుకోవడం కష్టమే" అన్నారు. 

" సీన్ ఏదైనా ఎన్టీఆర్ ఎదురుగా ఉన్న ఆర్టిస్టులు టేకులు తీసుకోవాలేమోగానీ, తాను మాత్రం సింగిల్ టేక్ లో చేసేస్తారు. సెట్లో ఆయన డైలాగ్స్ చూసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సింగిల్ టేక్ లో చెప్పేవారు. ఆయనలోని కసిని .. కృషిని దగ్గరగా చూసినవారిలో నేను ఒకడిని" అంటూ చెప్పుకొచ్చారు. 

Ntr
Subhalekha Sudhakar
Aravinda Sametha Movie
  • Loading...

More Telugu News