Prakash Raj: రమ్యకృష్ణపై ఆ సీన్ షూట్ చేయడానికి చచ్చిపోయాను: కృష్ణవంశీ

Krishna vamsi Interview

  • 'రంగమార్తాండ' ప్రమోషన్స్ లో బిజీగా కృష్ణవంశీ
  • క్లైమాక్స్ చిత్రీకరణ గురించిన ప్రస్తావించిన దర్శకుడు 
  •  ఆ సమయంలో గుండెను రాయిచేసుకున్నానని వ్యాఖ్య
  • ఆ రాత్రంతా నిద్రపోలేదని వెల్లడి 
  • ఈ నెల 22న విడుదలవుతున్న సినిమా

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగమార్తాండ' సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కృష్ణవంశీ బిజీగా ఉన్నారు. తాజాగా 'ఐ డ్రీమ్స్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడారు. 

"ఈ కథ నాటకరంగానికి చెందిన ఒక కళాకారుడి చుట్టూ తిరుగుతుంది. నాటకం చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలగాలి. అందువల్లనే ఎక్కడా క్రేన్ షాట్స్ .. ట్రాలీ షాట్స్ .. జిమ్మీ జిప్ షాట్స్ ను తీయలేదు. ఎమోషన్స్ కోసం ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. పాత్రలన్నీ కూడా చాలా సజీవంగా కనిపిస్తూ ఉంటాయి" అన్నారు. 

" రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగని చెప్పేసి భారీ డైలాగులు ఉండవు. క్లైమాక్స్ లోని ఒక సీన్ ను ఆమెపై షూట్ చేయడానికి చచ్చిపోయాను. ఆ సీన్ రాస్తున్నప్పుడే బాధ కలిగింది .. కానీ ఆ సీన్ చాలా ఇంపార్టెంట్. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు కళ్ల వెంట నీళ్లొస్తూనే ఉన్నాయి. ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు. ఒక రకంగా మనసును రాయిచేసుకునే షూట్ చేశాను" అని చెప్పుకొచ్చారు

More Telugu News