Budda Venkanna: సీమ చెల్లెమ్మ, అత్తిలి చిన్నమ్మ, శ్రీశైలం అమ్మమ్మ అందరి స్లోగన్ ఒకటేరా: బుద్దా వెంకన్న

MLC elections results reflects mood of AP says Budda Venkanna

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ
  • రెండు స్థానాల్లో గెలుపు.. ఒక స్థానంలో పోటాపోటీ
  • ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థమవుతోందన్న బుద్దా వెంకన్న

ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. 

ఈ సందర్భంగా టీడీపీ నేత, పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ... ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థమవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బైబై చెప్పడం ఖాయమని తేలిపోయిందని అన్నారు. 'సీమ చెల్లెమ్మ, అత్తిలి చిన్నమ్మ, శ్రీశైలం అమ్మమ్మ అందరి స్లోగన్ ఒకటేరా... సైకో పోవాలి, సైకిల్ రావాలి' అని ట్వీట్ చేశారు.

More Telugu News