Delhi Capitals: అమెరికాలో క్రికెట్ లీగ్... సత్య నాదెళ్ల ఫ్రాంచైజీతో చేయి కలిపిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals join hands with Satya Nadella franchise

  • అమెరికాలోనూ టీ20 క్రికెట్ లీగ్
  • మేజర్ లీగ్ క్రికెట్ పేరుతో జులైలో టోర్నీ
  • సియాటెల్ ఆర్కాస్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. దాంతో అనేక దేశాల్లో ఐపీఎల్ తరహా లీగ్ లు ప్రారంభం అయ్యాయి. తాజాగా, అమెరికాలోనూ ఓ టీ20 క్రికెట్ లీగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ లీగ్ పేరు మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్ సీ). ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సియాటెల్ ఆర్కాస్ అనే ఫ్రాంచైజీలో భాగస్వామిగా ఉన్నారు. 

ఇప్పుడీ సియాటెల్ ఫ్రాంచైజీతో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ చేయి కలిపింది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ లో తాము సత్య నాదెళ్ల ఫ్రాంచైజీ సియాటెల్ ఆర్కాస్ తో కలిసి పనిచేయనున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ లోని భాగస్వామ్య సంస్థ జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. 

అమెరికాలో క్రికెట్ లీగ్ ఈ ఏడాది జులై 13న ప్రారంభం కానుంది. కాగా, అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ లో ఢిల్లీ క్యాపిటల్సే కాదు... కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పలు ఫ్రాంచైజీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి.

Delhi Capitals
Satya Nadella
GMR
Seattle Orcas
MLC
USA
  • Loading...

More Telugu News