Chiranjeevi: చిరంజీవి సినిమాలో అక్కినేని నటవారసుడు సుశాంత్

Sushanth gets offer in Chiranjeevi movie Bhola Shankar

  • మెగాస్టార్ తాజా చిత్రం 'భోళాశంకర్' సినిమాలో సుశాంత్ కు ఛాన్స్
  • ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేశ్
  • కీర్తి బోయ్ ఫ్రెండ్ పాత్రకు సుశాంత్ ఎంపిక

హీరో సుశాంత్ అక్కినేని కుటుంబం నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతోంది. 'కాళిదాసు' అనే సినిమాతో సినీ అరంగేట్రం చేశాడు. ఘనమైన నట వారసత్వం ఉన్నప్పటికీ స్టార్ డమ్ ను మాత్రం సుశాంత్ అందుకోలేకపోయాడు. ఒకట్రెండు సినిమాలు మినహా ఇతర సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో సుశాంత్ రూటు మార్చాడు. 'అల వైకుంఠపురములో' చిత్రంతో సెకండ్ హీరోగా మారాడు. 'రావణాసుర' సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా ఆఫర్ కొట్టేశాడు. 'భోళాశంకర్' సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కీర్తి బోయ్ ఫ్రెండ్ గా సుశాంత్ నటించనున్నాడు. తమిళంలో హిట్ అయిన 'వేదాళం' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Chiranjeevi
Sushanth
Keerthy Suresh
Bhola Shankar
Tollywood
  • Loading...

More Telugu News