Tik Tok: బ్రిటన్ లోనూ టిక్ టాక్ పై నిషేధం

Britain bans Tik Tok in govt devices

  • పలు దేశాల్లో టిక్ టాక్ పై పాక్షిక నిషేధం
  • బ్రిటన్ లో ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ పై బ్యాన్
  • అనుమతి ఉన్న యాప్ లనే వినియోగించాలని ఆదేశాలు

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు బ్రిటన్ లోనూ కష్టకాలం తప్పలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. 

టిక్ టాక్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్ లను మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ప్రభుత్వ పరికరాల్లో ఎంతో సున్నితమైన సమాచారం ఉంటుందని, అందుకే ముప్పును నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.

అమెరికా, బెల్జియం కూడా ఇంతకుముందే ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ పై నిషేధం విధించాయి. చట్టసభల్లో టిక్ టాక్ వినియోగించరాదని అమెరికా గతేడాది డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది. 

అటు, కెనడా కూడా ఈ చైనా యాప్ పై నిషేధం కొరడా ఝుళిపించింది. భారత్ లో టిక్ టాక్ యాప్ పై 2020లోనే వేటు పడడం తెలిసిందే. యూజర్ల డేటాపై సదరు చైనా సంస్థకు నియంత్రణ ఉండడమే ఆయా దేశాల నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

Tik Tok
Britain
Ban
Govt Devices
  • Loading...

More Telugu News