Ramachandra Pillai: ఢిల్లీ లిక్కర్ స్కామ్... రామచంద్రపిళ్లైకి కస్టడీ పొడిగింపు 

Ramachandra Pillai custody extended in Delhi Liquor Scam
  • ఈనాటి విచారణకు హాజరు కాని కవిత
  • పిళ్లైతో కలిపి కవితను విచారించాలన్న ఈడీ
  • వైసీపీ ఎంపీ మాగుంటకు కూడా నోటీసులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్ర పిళ్లైకి సీబీఐ కోర్టు మరోసారి కస్టడీని పొడిగించింది. ఈ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిపి పిళ్లైను విచారించాల్సి ఉందని... అయితే ఈనాటి విచారణకు కవిత హాజరుకాలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. పిళ్లై కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది. ఈడీ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు పిళ్లై కస్టడీని పొడిగించింది. 

మరోవైపు ఈనాటి విచారణకు హాజరు కాలేకపోతున్నానని కవిత ఈడీకి వర్తమానం పంపారు. దీంతో, ఈనెల 20న హాజరు కావాలంటూ ఈడీ మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Ramachandra Pillai
Delhi Liquor Scam
Enforcement Directorate

More Telugu News