Nagashourya: హీరోపై హీరోయిన్ అనుమానం: 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' ట్రైలర్ రిలీజ్!

Phalana Abbayi Phalana Ammayi trailer releaased

  • రేపు థియేటర్లకు 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
  • అవసరాల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చే కంటెంట్ 
  • ఇప్పటికే పాప్యులర్ అయిన పాటలు

నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రూపొందింది. విశ్వప్రసాద్ - దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్, ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరోయిన్ .. హీరోను అనుమానించే ఒక సీన్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ .. పెళ్లి .. అలకలు .. బుజ్జగింపులను కలుపుకుంటూ వెళ్లే కథలా ఈ సినిమా కనిపిస్తోంది. 

కల్యాణి మాలిక్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే బాగా పాప్యులర్ అయ్యాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ అవసరాల మార్క్ మూవీ కావడంతో, టైటిల్ దగ్గర నుంచే పాజిటివ్ బజ్ మొదలైంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News