Prakash Raj: నేను కృష్ణవంశీగారికి పెద్ద ఫ్యాన్: శేఖర్ కమ్ముల

Ranga Marthanda movie update

  • కృష్ణవంశీ రూపొందించిన 'రంగ మార్తాండ'
  • స్పెషల్ షో చూసిన సినీ ప్రముఖుల స్పందన 
  • సినిమా చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదన్న శేఖర్ కమ్ముల 
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల

చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమా రానుంది. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ..బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించారు. 'ఉగాది' కానుకగా ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ షో ద్వారా 'రంగమార్తాండ' చూసిన పలువురు ప్రముఖులు సినిమాను స్పందించారు. 

దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న శేఖర్ కమ్ముల, 'రంగ మార్తాండ' సినిమాను గురించి ప్రస్తావించాడు. "నేను కృష్ణవంశీగారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన నుంచి ఎప్పుడు ఏ సినిమా వస్తున్నా, ఆ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటాను. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఆయన విశ్వరూపం చూడటానికి ఎదురుచూస్తున్నాను" అన్నారు.  

"ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ మధ్య కాలంలో సినిమా చూస్తూ నేను ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నా కళ్ల వెంట నీళ్లు కారిపోయాయి. నిజంగా ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News