kareena kapoor: ఆఫ్రికాలో కొత్త స్నేహితులతో ఉన్నా: కరీనా కపూర్

Kareena Kapoor in Africa

  • ఆఫ్రికా ట్రిప్ లో ఉన్న కరీనా కపూర్
  • భర్త, పిల్లలతో కలిసి ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ భామ
  • సఫారీ రిసార్ట్ లో తీసుకున్న ఫొటోను షేర్ చేసిన వైనం

బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఆఫ్రికాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ కుమారులు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ లతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అక్కడ ఒక సఫారీ రిసార్ట్ లో ఉన్న ఫొటోను కరీనా షేర్ చేసింది. ఈ ఫొటోలో కరీనా సోఫాలో పడుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో మేత మేస్తున్న జీబ్రాలు కనిపిస్తున్నాయి. ఈ పిక్ లో బ్లూ డెనిమ్ టాప్ తో కరీనా చాలా క్యూట్ గా కనిపిస్తోంది. కొత్త ఫ్రెండ్స్ తో ఉన్నా అంటూ ఫొటోకు కరీనా క్యాప్షన్ పెట్టింది. తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను కరీనా ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పంచుకుంటోంది. మరోవైపు కరీనా ఫొటోపై ఆమె మరదలు సబా పటౌడీ రెడ్ హార్ట్ ఎమోజీలను పెట్టి స్పందించారు. ఎంతో అందమైన మహిళ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.

kareena kapoor
saif ali khan
Africa
Bollywood
  • Loading...

More Telugu News