Priyadrshi: ఒక చిన్న సినిమా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు: 'బలగం' విజయోత్సవంలో దిల్ రాజు

Balagam Vijayothsava Veduka

  • ఈ నెల 3వ తేదీన విడుదలైన 'బలగం'
  • తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించిన సినిమా 
  • కరీంనగర్లో జరిగిన విజయోత్సవ వేడుక
  • రోజురోజుకి వసూళ్లు పెరుగుతున్నాయన్న దిల్ రాజు 
  • 80 ఏళ్ల సినిమా చరిత్రలో ఇదే ఫస్టు టైమ్ అంటూ వెల్లడి

దిల్ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి - హన్సిత రెడ్డి నిర్మించిన 'బలగం' సినిమా, ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి - కావ్య జంటగా నటించారు. ఇటీవల ఈ సినిమా టీమ్ ను మెగాస్టార్ సత్కరించిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ సినిమా విజయోత్సవ వేడుక నిన్న రాత్రి కరీంనగర్ లో జరిగింది.

ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. "ముందుగా గంగుల కమలాకర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన మా అందరికీ ఇక్కడ సన్మానాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఇక్కడి థియేటర్లో టిక్కెట్లన్నీ బుక్ చేసి మీ అందరికీ సినిమాను చూపించడం గొప్ప విషయం. నాకు తెలిసి ఈ 80 ఏళ్ల సినిమా చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అయ్యుంటుంది" అన్నారు. 

"ఎప్పుడో 'తాత - మనవడు' వచ్చింది .. ఆ తరువాత 'మాతృదేవత' వచ్చింది. ఆ సినిమాల్లో కథనే హీరో. సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అలా ఈ జనరేషన్ లో చెప్పుకోదగినదిగా 'బలగం' మాత్రమే ఉంది. రోజురోజుకీ ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతుండటం విశేషం. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే వచ్చే కిక్కు దేంట్లోను రాదు. తెలంగాణలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు. 


More Telugu News