Ram Gopal Varma: నాగార్జున యూనివర్శిటీలో మహిళల గురించి రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

RGV sensational comments on Women

  • జీవితాన్ని ఇక్కడూ ఎంజాయ్ చేయాలన్న ఆర్జీవీ
  • తాగండి, తినండి అని సూచన
  • కష్టపడి చదివేవారు పైకి రారని వ్యాఖ్య

నాగార్జున యూనివర్శిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని.. అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయాలని చెప్పారు. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకాలని అన్నారు. కష్టపడకుండా, ఉపాధ్యాయుల మాటలు వినకుండా ఇష్టానుసారం జీవించాలని చెప్పారు.

కష్టపడి చదివేవారు ఎప్పుడూ పైకి రారని అన్నారు. ఏదైనా వైరస్‌ వచ్చి నేను తప్ప మగ వాళ్లంతా పోవాలని... అప్పుడు తానొక్కడినే స్త్రీ జాతికి దిక్కవుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అని విద్యార్థులకు సూచించారు. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూనివర్శిటీ విద్యార్థులకు చెప్పాల్సిన విషయాలు ఇవేనా? అని పలువురు మండిపడుతున్నారు. యూనివర్శిటీ విద్యార్థులు, మహిళా ఉద్యోగులు సైతం విమర్శిస్తున్నారు.

Ram Gopal Varma
Tollywood
Women
Nagarjuna University
  • Loading...

More Telugu News