Kiran Abbavaram: మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న కిరణ్ అబ్బవరం!

Meter lyrical song released

  • మైత్రీ బ్యానర్లో రూపొందిన 'మీటర్' 
  • కిరణ్ అబ్బవరం జోడీగా మెరవనున్న అతుల్య రవి
  • సంగీతాన్ని అందించిన సాయికార్తీక్ 
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా రిలీజ్

కిరణ్ అబ్బవరం హీరోగా ఆయన నుంచి రావడానికి 'మీటర్' సినిమా రెడీ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ - క్లాప్ వారు నిర్మించిన ఈ సినిమాకి రమేశ్ దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాతో, తెలుగు తెరకి అతుల్య రవి కథానాయికగా పరిచయమవుతోంది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'చమ్మక్ చమ్మక్ పోరి .. న ధడకు ధడకు నారి' అంటూ ఈ పాట సాగుతోంది. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు బాలాజీ సాహిత్యాన్ని అందించగా,  అరుణ్ కౌండిన్య - గాయత్రి ఆలపించారు. భాను కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది.  
  
ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో హిట్ కొట్టిన కిరణ్, పెద్దగా గ్యాప్ లేకుండానే 'మీటర్' తో వస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ తో .. కొత్త స్టయిల్ తో కనిపిస్తున్న కిరణ్, పెద్ద గ్యాప్ లేకుండానే మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. 

Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News