Deepika Padukone: దీపికా పదుకొణే కొత్త టాటూ '82°E'... దీని అర్థం ఏమిటంటే..!

Deepika Padukone new tatto

  • ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో సందడి చేసిన దీపిక
  • మెడపై 82°E అనే టాటూ వేయించుకున్న వైనం
  • 82°E అనేది ఆమె కొత్తగా ప్రారంభించిన స్కిన్ కేర్ బ్రాండ్

ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే సందడి చేసిన విషయం తెలిసిందే. రెడ్ కార్పెట్ పై ఆమె ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ధరించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఆమె మెడపై ఉన్న టాటూ అందరినీ ఆకర్షించింది. తాజాగా ఆమె 82°E అనే టాటూను మెడపై వేయించుకుంది. 82°E అంటే ఏమిటంటూ నెటిజెన్లు ఇంటర్నెట్ లో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. 82°E అంటే '82 డిగ్రీస్ ఈస్ట్' అని అర్థం. 82°E అనేది ఆమె కొత్తగా మొదలుపెట్టిన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. కొన్ని నెలలుగా ఈ బ్రాండ్ పేరు మీద చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. సో... తన పొంత ప్రాడక్ట్ ను దీపిక టాటూగా వేయించుకుందన్నమాట. 

Deepika Padukone
Bollywood
Tatto
  • Loading...

More Telugu News