Ajay Devgn: ఎందుకు టబుతోనే సినిమాలు చేస్తుంటావు?.. అన్న ప్రశ్నకు అజయ్ దేవగణ్ జవాబు ఇదే!

Ajay Devgn Was Asked Why He Only Does Films With Tabu this is His LOL Reply

  • ‘భోళా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అజయ్ దేవగణ్
  • ‘ఆస్క్ భోళా’ పేరుతో ట్విట్టర్ లో ముచ్చటించిన బాలీవుడ్ హీరో
  • మార్చి 30న విడుదల కానున్న సినిమా

ప్రస్తుతం ‘భోళా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్విట్టర్ లో ‘ఆస్క్ భోళా’ అంటూ అభిమానులతో అజయ్ ముచ్చటించారు. 

ఈ సందర్భంగా ఓ అభిమాని అసక్తికర ప్రశ్న అడిగాడు. ‘మీరు అన్ని సినిమాలు టబుతోనే చేస్తున్నారు. దీనికి ఏదైనా కారణం ఉందా?’ అని ట్వీట్ చేశాడు. దీనికి అజయ్ బదులిస్తూ.. ‘ఎందుకంటే.. ఆమె డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి’ అని చెప్పారు.

‘భోళా ఎంత రాబడుతుందని మీరు అనుకుంటున్నారు?’ అని ఓ యూజర్ అడగ్గా.. ‘ఎంత డబ్బు కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ.. మీ ప్రేమను పొందుతుందని మాత్రం ఆశిస్తున్నా’ అని అజయ్ బదులిచ్చారు.

దృశ్యం, దృశ్యం 2, గోల్ మాల్ అగైన్, దేదే ప్యార్ దే, విజయ్ పథ్, హఖీఖత్, తక్షక్ తదితర సినిమాల్లో అజయ్ దేవగణ్, టబు కలిసి నటించారు. ఇక ఆర్ఆర్ఆర్ లోనూ ఓ ముఖ్య పాత్రలో అజయ్ దేవగణ్ మెరిశారు. తెలుగులో ఆయనకు అదే తొలి సినిమా.

More Telugu News