Raviteja: 'రావణాసుర'లో వెంకీ హిట్ సాంగ్ .. రవితేజ స్టైల్ రీమిక్స్!

Ravanasura lyrical song release

  • సుధీర్ వర్మ నుంచి 'రావణాసుర'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న రవితేజ 
  • యంగ్ బ్యూటీస్ తో ఆయన ఆటపాటలు
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల

రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' రూపొందింది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ - భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. మరింత మాస్ యాక్షన్ తో ఎనర్జిటిక్ గా కనిపించడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. 
 
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. రవితేజ - మేఘ ఆకాశ్ పై చిత్రీకరించిన ఈ పాట,  'వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తినే .. ' అంటూ  ఈ పాట కొనసాగుతోంది. 

1991లో వెంకటేశ్ హీరోగా వచ్చిన 'సూర్య ఐపీఎస్' సినిమాలోని పాటకు ఇది రీమిక్స్. సిరివెన్నెల రాసిన ఆ పాటకు అప్పట్లో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఆ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో అనూ ఇమ్మాన్యుయేల్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ ... రావు రమేశ్ .. మురళీ శర్మ .. సంపత్ రాజ్ కనిపించనున్నారు.

Raviteja
Megha Akash
Anu Emmanuel
Rao Ramesh
Ravanasura

More Telugu News