Ramcharan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం!

prime minister modi honor to mega powerstar ram charan

  • ఈనెల 17, 18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్
  • ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకోనున్న చరణ్
  • ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ ను సత్కరించనున్న మోదీ, సచిన్!

‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేదిక పంచుకోనున్నారు. రెండు రోజుల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ లో వీరిద్దరూ పాల్గొననున్నారు. ఇదే కార్యక్రమంలో చరణ్ ను ప్రధాని మోదీ సత్కరించనున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న ఈవెంట్ కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొననున్నారు.

ఆస్కార్ తర్వాత చరణ్ తొలిసారి రాబోతుండటంతో అక్కడ ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, సచిన్ కలిసి చరణ్ ను సత్కరిస్తారని సమాచారం. తర్వాత ఇదే వేదికపై నుంచి రామ్ చరణ్ ప్రసంగిస్తారని తెలుస్తోంది.

పలు అంశాలపై తన అభిప్రాయాలను చరణ్ పంచుకోనున్నారు. అలాగే నటుడిగా తన ప్రయాణం, ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విధానం, గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడం, ఆస్కార్ గెలుచుకోవడం వంటి విషయాలను చరణ్ వివరించనున్నారు.

Ramcharan
Narendra Modi
india today conclave
RRR
Sachin Tendulkar
modi honors ram charan
  • Loading...

More Telugu News