Vishwak Sen: ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Das Ka Dhamki Movie Update

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ'
  • ఆయన జోడీగా సందడి చేయనున్న నివేదా పేతురాజ్
  • ఈ నెల 17న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్

విష్వక్సేన్ హీరోగా 'దాస్ కా ధమ్కీ' సినిమా రూపొందింది. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు - శిల్పకళా వేదికలో జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. 

ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. తరుణ్ భాస్కర్ .. పృథ్వీ .. రోహిణి కనిపించనున్నారు. హీరోగా .. దర్శకుడిగా విష్వక్ మరోసారి సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.

Vishwak Sen
Nivetha Pethuraj
Das Ka Dhamki Movie
  • Loading...

More Telugu News