: ఘనంగా హనుమజ్జయంతి
భక్తికి ప్రతిరూపమైన ఆంజనేయుడి జయంతి నేడు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హిందువులు భక్తి ప్రపత్తులతో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలంలో అధికారులు భక్తులకు ఉచితంగా పులిహోర అందించేలా ఏర్పాట్లు చేశారు. స్వయంభువుగా భావించే కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల నుంచీ భక్తులు తరలి వచ్చారు. హనుమంతుని మండల దీక్ష పూర్తి చేసుకున్న స్వాములతో రెండు ఆలయాలూ కిటకిటలాడుతున్నాయి.