Mumbai Indians: డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ పాంచ్ పటాకా

Mumbai Indians women registers fifth win in a row
  • డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు వరుసగా ఐదో విజయం
  • గుజరాత్ జెయింట్స్ పై 55 పరుగుల తేడాతో విక్టరీ
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ముంబయి
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబయి వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 55 పరుగుల తేడాతో నెగ్గి పాంచ్ పటాకా మోగించింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ముంబయి బౌలర్లలో నాట్ షివర్ 3, హేలీ మాథ్యూస్ 3, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీసి గుజరాత్ ను దెబ్బకొట్టారు. గుజరాత్ జట్టులో హర్లీన్ డియోల్ 22, కెప్టెన్ స్నేహ్ రాణా 20 పరుగులు చేశారు. 

డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టు తానాడిన ఐదు మ్యాచ్ ల్లోనూ నెగ్గి ఓటమన్నదే ఎరుగకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Mumbai Indians
Women
WOL
Gujarat Giants

More Telugu News