Jagan: జులైలో విశాఖకు తరలి వెళుతున్నాం: సీఎం జగన్

CM Jagan tells ministers govt will shit Vizag in July

  • సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • విశాఖకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు
  • విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని మంత్రులతో చెప్పిన వైనం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, జులైలో విశాఖకు తరలివెళుతున్నామని తెలిపారు. విశాఖ నుంచే పాలన ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

More Telugu News