Sensex: వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • 337 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 111 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన ఎం అండ్ ఎం షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో ప్రముఖ బ్యాంకులు మూత పడటం ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు కోల్పోయి 57,900కి పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 17,043కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (1.17%), భారతి ఎయిర్ టెల్ (0.80%), ఎల్ అండ్ టీ (0.65%), సన్ ఫార్మా (0.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.39). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.92%), టీసీఎస్ (-2.00%), బజాజ్ ఫైనాన్స్ (-1.91%), విప్రో (-1.75%), కోటక్ బ్యాంక్ (-1.60%).    

  • Loading...

More Telugu News