Samantha: సమంత వ్యక్తిగత జీవితంపై ఉమైర్ సంధు ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్

Samantha had abortion says Umair Sandhu

  • సమంతను నాగ చైతన్య టార్చర్ పెట్టాడన్న ఉమైర్
  • సమంత మానసికంగా, శారీరకంగా వేదనను అనుభవించిందని వ్యాఖ్య
  • చైతూ బ్యాడ్ హస్బెండ్ అంటూ కామెంట్

బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసే ట్వీట్లు ఎప్పుడూ వివాదాస్పదమవుతుంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన టాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉమనైజర్ అని... మహేశ్ బాబు, పూజ హెగ్డే మధ్య ఏదో ఉందని ట్వీట్లు చేసి టాలీవుడ్ అభిమానుల చేత ఒక లెవెల్లో తిట్లు తిన్నాడు. ఇప్పుడు తాజాగా సమంత వ్యక్తిగత జీవితంపై ట్వీట్ చేశాడు. సమంతను నాగ చైతన్య చాలా టార్చర్ పెట్టాడని తెలిపాడు. చైతూ ఒక బ్యాడ్ హస్బెండ్ అని విమర్శించాడు. 

ఆయన వల్ల సమంత శారీరకంగా, మానసికంగా చాలా వేదనను అనుభవించిందని అన్నాడు. సమంత గర్భం దాల్చినప్పటికీ చైతూ వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో ఆయనపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ విషయం నీకు సమంత చెప్పిందా? అంటూ మండిపడుతున్నారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే బాగోదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

Samantha
Naga Chaitanya
Umair Sandhu
Tollywood
  • Loading...

More Telugu News