Raja Singh: బీజేపీలో చిచ్చు రేపిన కవిత అంశం.. ఎంపీ అర్వింద్ పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

Raja Singh comments on D Arvind

  • కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
  • సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న ధర్మపురి అర్వింద్
  • సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలన్న రాజాసింగ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీలో సైతం బండి సంజయ్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలను తాను సమర్థించబోనని చెప్పారు. ఆ వ్యాఖ్యలు సంజయ్ వ్యక్తిగతమని... ఆ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని అన్నారు. అంతేకాదు ఆ వ్యాఖ్యలను సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని కూడా సూచించారు. 

మరోవైపు అర్వింద్ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ... బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలని అన్నారు. సంజయ్ మాటలు వ్యక్తిగతం కాదని... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే మాట్లాడారని చెప్పారు. అర్వింద్ కు ఏదైనా ఇబ్బంది ఉన్నా, సందేహాలు ఉన్నా నేరుగా సంజయ్ తో మాట్లాడాలని... మీడియా ముందు డైరెక్ట్ గా మాట్లాడటం సరికాదని అన్నారు.

Raja Singh
D Arvind
Bandi Sanjay
BJP
Telangana
K Kavitha
BRS
  • Loading...

More Telugu News