Pooja Hegde: పూజ ప్లానింగుపై అభిమానుల మాట ఇదే!

Pooja Hegde Special

  • టాప్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే 
  • వరుస ఫ్లాపులతో సతమతం 
  • చేతిలో ఉన్నది ఒక్క తెలుగు సినిమా మాత్రమే
  • కొత్త భామల నుంచి పెరుగుతున్న పోటీ  
  • గ్యాప్ రాకుండా చూసుకోకపోతే కష్టమేనంటున్న ఫ్యాన్స్  

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పూజ హెగ్డే కొనసాగుతోంది. ఆ తరువాత స్థానాల్లోనే రష్మిక - కీర్తి సురేశ్ ఉన్నారు. ఒకానొక దశలో పూజ స్టార్ హీరోలతో వరుస హిట్లు ఇస్తూ, ఇతర హీరోయిన్స్ అసూయపడే స్థాయికి చేరుకుంది. అయితే ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. ఆ సినిమాల జాబితాలోనే 'రాధే శ్యామ్' ... 'బీస్ట్' .. 'ఆచార్య' కనిపిస్తాయి. 

నిజానికి ఈ సినిమాలు భారీ పరాజయాలను చవిచూసినప్పటికీ, ఆమె కెరియర్ పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ ఆమె ప్లానింగ్ దెబ్బ కొట్టడం వలన గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ -  మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా చేస్తోంది. తెలుగుకి సంబంధించి ఈ సినిమా మాత్రమే ఆమె చేతిలో ఉంది. ఇది ఈ ఏడాది చివరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకూ పూజ నుంచి వచ్చే సినిమా ఏదీ లేదు. 

పూజ హెగ్డే కేజ్ కి ఇంతవరకూ ఢోకా అయితే లేదు. కానీ ఈ స్థాయిలో గ్యాప్ వస్తే మాత్రం కష్టమే. ఎందుకంటే శ్రీలీల .. కృతి శెట్టి వంటి కుర్ర హీరోయిన్స్ జోరు పెరుగుతోంది. ఆషిక రంగనాథ్ .. సాక్షి వైద్య వంటి కొత్త హీరోయిన్స్ నుంచి పోటీ పెరుగుతోంది. మరో వైపున బాలీవుడ్ బ్యూటీలు సైతం పోటీలు పడుతూ ఇక్కడి ఆఫర్లకు పచ్చజెండా ఊపేస్తున్నారు. అందువలన పూజ సరైన ప్లాన్ చేసుకోకపోతే కష్టమే అనేది అభిమానుల మాట. 

More Telugu News