: ఈ చెట్లు స్వయం ప్రకాశకాలు!


జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో వైద్యుడు ఒక మూలిక గురించి చిరంజీవికి చెప్పి అవి స్వయం ప్రకాశకాలు అని చెబుతాడు కదా... అలాగే ఈ కొత్తరకం మొక్కలు స్వయం ప్రకాశకాలట... పలువురు శాస్త్రవేత్తలు కలసికట్టుగా కృషి చేసి, ఈ కొత్త మొక్కలను తయారు చేశారు. మొక్కలు తయారు చేయడం ఏంటా అనుకోకండి... అంటే సాధారణ మొక్కలను శాస్త్రవేత్తలు అలా మెరిసేలా తయారు చేశారు. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌లోని సింథటిక్‌ బయాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు ఈ అరుదైన మొక్కలను తయారు చేశారు.

ఆంటోని ఈవాన్స్‌, డాక్టర్‌ అమిరవ్‌ డ్రోరీ, కైల్‌ టేలర్‌ వంటి బయోటెక్నాలజీలో ఆసక్తి ఉన్నవారు పలువురు కలిసి ఒక జట్టుగా ఏర్పడ్డారు. వీరు ఒక జీవిలో రాత్రిపూట వెలిగే స్వభావం ఉన్న జన్యువును గుర్తించారు. దాని డి.ఎన్‌.ఎ క్రమాన్ని ఒక మొక్కలో ప్రవేశపెట్టారు. దీంతో ఆ మొక్క రాత్రిపూట మెరవడం ప్రారంభించింది. అరాబడాస్పిస్‌ ధాలియానా అనే మొక్కలో ఈ డిఎన్‌ఎ క్రమాన్ని వీరు ప్రవేశపెట్టారు. దీంతో ఆ మొక్క రాత్రిపూట మెరుపులీనుతుంటుంది. ఈ మొక్కలు 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయని, వీటిని రోడ్డుకు ఇరువైపులా నాటితే అప్పడు వీధి దీపాలతో అవసరం ఉండదని ఈవాన్స్‌ చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అవసరమైన 1.5 కోట్ల రూపాయలను సుమారు 4500 మంది దాతలు అందించారు. మరో ముఖ్య విషయమేమంటే త్వరలో వీరు తమ దృష్టిని మెరిసే రోజాపువ్వు మొక్కలను తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ కొత్త మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఎంచక్కా విద్యుత్తును కూడా మనం ఆదా చేసుకోవచ్చు కదా...!

  • Loading...

More Telugu News