Rupa Devi: అందుకే నటించడం లేదన్న సీనియర్ నటి!     

Rupa Interview

  • ఆర్ట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రూపాదేవి 
  • 'దాసి' సినిమాలో దొరసాని పాత్రతో గుర్తింపు 
  • 'రుతు రాగాలు' సీరియల్ ను ఇప్పటికీ మరిచిపోని ప్రేక్షకులు 
  • నటనకి స్కోప్ లేని పాత్రలు చేయనని చెప్పిన రూపాదేవి

ఆర్ట్ సినిమాల్లో కీలకమైన పాత్రలను పోషించి .. బుల్లితెరపై కూడా 'రుతురాగాలు' వంటి సీరియల్ ద్వారా మెప్పించిన నటిగా రూపాదేవి కనిపిస్తారు. సినిమాలతో పోల్చుకుంటే, బుల్లితెర ద్వారా ఆమెకి వచ్చిన గుర్తింపునే ఎక్కువ. ఈ మధ్య కాలంలో నటనకు ఆమె దూరంగా ఉంటున్నారు. అదే విషయాన్ని గురించిన ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో అడిగితే, తనదైన తరహాలో ఆమె స్పందించారు. 

"కమర్షియల్ రోల్స్ చేయమని పొలోమని అడిగేయడం .. నేను రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించడం వంటి సందర్భాలు రాలేదనే చెప్పాలి. ఒక కథలో పెద్ద ఫ్యామిలీ ఉంటుంది .. ఆ ఫ్యామిలీలో ఓ డజను మంది ఉంటారు. కానీ అందులో ఎవరూ చేయడానికి ఏమీ ఉండదు. అలాంటి కథలను మాత్రం పారితోషికం వరకూ కూడా రానీయను" అని అన్నారు. 

'దాసి' సినిమాలో కథ అంతా కూడా దాసి - దొర - దొరసాని మధ్యనే తిరుగుతుంది. నాతో 'దాసి' పాత్రను చేయించాలని చూశారుగానీ, నా కలర్ టోన్ వలన దొరసాని పాత్రను చేయించారు. ఆ పాత్ర నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అప్పట్లో ఒక ప్రయోగం చేయాలంటే బాగా ఆలోచన చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు కంటెంట్ ను జనం ముందుకు తీసుకుని వెళ్లాడానికి చాలానే అవకాశాలు అందుబాటులోకి రావడం హర్షణీయం" అని చెప్పుకొచ్చారు. 

Rupa Devi
Actress
Ruthu Ragalu
  • Loading...

More Telugu News