Ramcharan: ఆస్కార్ ఫంక్షన్ లో రామ్ చరణ్, దీపికా పదుకొణే.. ఫొటో వైరల్

Ram Charan and Deepika Padukone in Oscars

  • అట్టహాసంగా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలు
  • వేడుకలకు హాజరైన దీపికా పదుకొణే
  • బ్లాక్ డ్రెస్ లో మెరిసిన బాలీవుడ్ భామ

95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది. అవార్డుల కార్యక్రమానికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ లోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ, రమా రాజమౌళి తదితరులు హాజరయ్యారు. 

మరోవైపు బాలీవుడ్ భామ దీపికా పదుకొణే గెస్ట్ గా అవార్డుల ఫంక్షన్ లో మెరిసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్, దీపిక కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఆఫ్ షోల్డర్ బ్లాక్ వెల్వెట్ గౌన్ లో దీపిక మరింత ఆకర్షణీయంగా కనిపించింది. 

Ramcharan
Deepika Padukone
Oscars
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News