Keeravani: ఆస్కార్ అవార్డు అందుకుని వేదికపై ఇంగ్లీష్ పాట పాడిన కీరవాణి.. వీడియో ఇదిగో

Keeravani speech in Oscars

  • 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు
  • సగర్వంగా ఆస్కార్ ను అందుకున్న కీరవాణి
  • ఈరోజు తన చేతిలో ఆస్కార్ ఉందన్న సంగీత దిగ్గజం

130 కోట్ల మంది భారతీయుల కలను 'ఆర్ఆర్ఆర్' సినిమా సాకారం చేసింది. ఈ చిత్రంలోని 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సాధించింది. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఆస్కార్ అందుకున్న అనంతరం వేదికపై కీరవాణి మాట్లాడుతూ.. పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

'నాకు ఆస్కార్ ఇచ్చిన అకాడెమీకి ధన్యవాదాలు. ఈరోజు నా చేతిలో ఆస్కార్ ఉంది. నా మదిలో ఒక కోరిక ఉండేది. రాజమౌళి, నా కుటుంబం కోరుకున్న మాదిరే... ఆర్ఆర్ఆర్ గెలవాలి, ప్రతి భారతీయుడు గర్వపడాలి. నన్ను ఈ ప్రపంచంలో ఎత్తైన స్థానంలో ఉంచాలి. దీని కోసం కృషి చేసిన కార్తికేయకు థ్యాంక్స్' అని కీరవాణి పాట రూపంలో చెప్పారు. 

Keeravani
RRR
Natu Natu
Oscar
Speech
Tollywood

More Telugu News